Fri Jan 24 2025 16:28:11 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ పులివెందుల ప్రత్యర్థి.. చివరికి
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉన్నారు. తనతో వచ్చే వారిని కలుపుకుంటూ వెళుతున్నారు. అలాగని ఆయన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదనుకోండి. తనతో నడిచే వ్యక్తులను ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాంటిదే ఓ ఆసక్తికర ఘటన తాజాగా చోటు చేసుకుంది. పులివెందులలో ఆయనను ఓడించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి.. ఆయనతో చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. రెండు సార్లు పులివెందులలో సీఎం జగన్ మీద టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ఈసారి మాత్రం సీఎం జగన్ ను గెలిపించడానికి ప్రయత్నిస్తానని ఆయన చెబుతూ ఉండడం విశేషం.
ఇంతకూ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ చేతిలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సతీశ్ కుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సతీశ్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరిక సమయంలో అక్కడే ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నారు. సతీశ్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో సతీశ్ కుమార్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ తరఫున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2011లో ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. 2020లో టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో మరింత మెజారిటీతో సీఎం జగన్ ను గెలిపిస్తానని అంటున్నారాయన.
Next Story