Tue Jan 14 2025 03:32:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నేడు ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలను విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలను విడుదల చేయనున్నారు. ఈ మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,64,756 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇలా చూసుకోవాలి.....
అయితే ఈ ఫలితాలను bse.ap.gov.in వెబ్ సైట్ లో తమ రిజల్ట్ ను చూసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత హోం పేజీలో ఉన్న ఇంటర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ బటన్ నొక్కితే రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తాయని అధికారులు చెప్పారు. ప్రతి సబ్జెక్ట్ లో ఖచ్చితంగా 33 మార్కులు రావాల్సి ఉంటుందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.
Next Story