Tue Jan 14 2025 03:04:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత
ఉమ్మడి ఏపీలో తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సుందరనాయుడు బాలాజీ హాచరీస్ ను స్థాపించి
హైదరాబాద్ : ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, బాలాజీ హాచరీస్ వ్యవస్థాపకుడు సుందరనాయుడు గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో సాయంత్రం 4 గంటల సమయంలో సుందరనాయుడు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఉమ్మడి ఏపీలో తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సుందరనాయుడు బాలాజీ హాచరీస్ ను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. చిత్తూరుకు చెందిన సుందరనాయుడు పశువైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలాజీ హేచరీస్ స్థాపించి పౌల్ట్రీ రంగంలో అడుగు పెట్టి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించిన నాయుడు..కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేశారు. సుందరనాయుడు మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Next Story