Thu Jan 16 2025 02:27:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఐ పై దాడి కేసులో ట్విస్ట్.. రివర్స్ కేసు పెట్టిన పోలీసులు
తాజాగా.. ఈ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించని ట్విస్ట్ తో రెవెన్యూ ఉద్యోగులు షాకయ్యారు. ఆర్ఐతోపాటు, రెవెన్యూ సిబ్బంది
గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామంలో ఇటీవల మట్టి మాఫియా స్థానిక రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అరవింద్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 21, గురువారం రాత్రి సమయంలో అక్రమంగా మట్టి తరలిస్తుండగా ఆర్ఐ అరవింద్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆర్ఐ పై దాడికి దిగిన మట్టి మాఫియా.. అక్కడున్న జేసీబీతో నెట్టి హత్య చేసేందుకు యత్నించగా.. అరవింద్ తృటిలో తప్పించుకున్నారు. ఇదంతా అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగు చూసింది. ఆర్ఐ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేశారు.
తాజాగా.. ఈ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించని ట్విస్ట్ తో రెవెన్యూ ఉద్యోగులు షాకయ్యారు. ఆర్ఐతోపాటు, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ, తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, 511 కింద గుడివాడ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్ఐపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన సూత్రధారి గంటా సురేష్‌ను మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఆర్ఐ అరవింద్ పై కేసులు పెట్టడంపై రెవెన్యూ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముందు జరిగిన ఘటనపై చర్యలు తీసుకోకుండా.. ఇదేమిటని వాపోతున్నారు.
Next Story