రాజ్‌భవన్ లో పెండింగ్ బిల్లులు

రాజ్‌భవన్ లో అనేక ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ అధికారులను క్లారిటీ కోరారు

Update: 2022-11-08 12:54 GMT

రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మరింత దూరం పెరిగింది. రాజ్‌భవన్ లో అనేక ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ అధికారులను క్లారిటీ కోరారు. అనేక బిల్లులు గవర్నర్ పెండింగ్ లో ఉంచారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

యూజీసీకి లేఖ...
పలు బిల్లులపై గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్ మెంట్ బిల్లులను కూడా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వాలని గవర్నర్ అధికారులను కోరారు. యూజీసీ అభిప్రాయాన్ని కూడా గవర్నర్ కోరారు.


Tags:    

Similar News